Share News

భార్య కోరిక తీర్చేందుకు ఇల్లు అమ్మేశాడు.. 200 ఎకరాలను పూల తోటగా మార్చాడు..

ABN , Publish Date - Aug 15 , 2026 | 10:10 PM

భార్య చిన్ననాటి కోరికను తీర్చేందుకు ఓ చైనా వ్యక్తి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. భార్యకు హాలీహాక్ పూలంటే ఎంతో ఇష్టమని.. ఆమె కోసం ఏకంగా 200 ఎకరాల విస్తీర్ణంలో భారీ పూల తోటను నిర్మించాడు.

భార్య కోరిక తీర్చేందుకు ఇల్లు అమ్మేశాడు.. 200 ఎకరాలను పూల తోటగా మార్చాడు..
Hollyhock garden

ఇంటర్నెట్ డెస్క్: భార్య చిన్ననాటి కోరికను తీర్చేందుకు ఓ చైనా వ్యక్తి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. భార్యకు హాలీహాక్ పూలంటే ఎంతో ఇష్టమని.. ఆమె కోసం ఏకంగా 200 ఎకరాల విస్తీర్ణంలో భారీ పూల తోటను నిర్మించాడు. ఇందుకోసం తన ఇంటిని సైతం విక్రయించి, భూమిని కొనుగోలు చేసి, పదేళ్లకు పైగా శ్రమించాడు. ప్రస్తుతం ఈ తోట ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత వైవిధ్యమైన హాలీహాక్ తోటగా గుర్తింపు పొందింది (world's largest hollyhock garden).


చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చెంగ్డూకు చెందిన జౌ షియోలిన్, యిన్ జీ దంపతుల ప్రేమకథ ఇది. 2013లో యిన్ జీ తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ.. బీజింగ్‌లో తాను చూసిన హాలీహాక్ పూల గురించి భర్తతో చెప్పింది. భార్యకు ఆ పూలంటే ఉన్న ఇష్టాన్ని జౌ సీరియస్‌గా తీసుకున్నాడు. ఆమె చుట్టూ ఎప్పుడూ ఆ పూలే కనిపించేలా ఒక తోటను నిర్మిస్తానని మాట ఇచ్చాడు (Chinese husband, hollyhock garden).


భార్య కోరికను నెరవేర్చేందుకు జౌ తన ఇంటిని విక్రయించాడు (Wife childhood memory). ఆ డబ్బుతో జువాన్‌లాంగ్ టౌన్‌లో భూమిని కొనుగోలు చేసి, స్వయంగా పూల పెంపకం గురించి నేర్చుకున్నాడు. చైనా నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా హాలీహాక్ విత్తనాలను సేకరించాడు. బీడు భూమిని క్రమంగా భారీ పూల తోటగా మార్చాడు.


ఈ ప్రయాణానికి దాదాపు పదేళ్లకు పైగా సమయం పట్టింది. ఈ తోటలో 700కు పైగా రకాల హాలీహాక్ పూలు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు 1.5 లక్షల లిల్లీలు, సుమారు లక్ష చైనీస్ మందార మొక్కలు కూడా ఉన్నాయి. పూల వైవిధ్యం, విస్తీర్ణం కారణంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత వైవిధ్యమైన హాలీహాక్ తోటగా ప్రాచుర్యం పొందింది.


ఇవి కూడా చదవండి..

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు..


అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..

Updated Date - Aug 15 , 2026 | 10:10 PM