Share News

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..

ABN , Publish Date - Aug 15 , 2026 | 03:29 PM

అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఎగువ సుబన్‌సిరి, దిబాంగ్ వ్యాలీ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..
Arunachal flash flood

ఇంటర్నెట్ డెస్క్: అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఎగువ సుబన్‌సిరి, దిబాంగ్ వ్యాలీ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు (Arunachal Pradesh landslide).


ఎగువ సుబన్‌సిరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు మొదలయ్యాయి. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహాయక బృందాలకు సవాలుగా మారాయి. ఇక, దిబాంగ్ వ్యాలీ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించడంతో ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. వారిని గుర్తించేందుకు సైన్యం, స్థానిక యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టాయి (Arunachal flash flood).


వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది (Army personnel missing). వర్షాల కారణంగా నదులు, వాగుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన సైనికుల కోసం గాలింపు కొనసాగుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

స్త్రీశక్తి పథకానికి ఏడాది.. మహిళలతో సీఎం చంద్రబాబు బస్సు ప్రయాణం

Updated Date - Aug 15 , 2026 | 03:32 PM