నాయక్ సినిమా సీన్ రిపీట్.. వరుడి కొంపముంచిన పెళ్లి చూపుల ఫొటో..
ABN , Publish Date - Aug 19 , 2026 | 02:49 PM
పెళ్లి మండపంలో పెళ్లి కుమారుడిని తొలిసారి చూసిన పెళ్లి కూతురు అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. పెళ్లి చూపుల కోసం పంపిన ఫొటోలోని వ్యక్తికి .. పెళ్లి కుమారుడికి పోలికలు లేవంటూ పెళ్లి క్యాన్సిల్ చేసింది. ఈ సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా నటించిన నాయక్ సినిమాలో బ్రహ్మానందం యవ్వనంలో ఉన్న ఫొటోను పెళ్లి చూపులకు పంపుతాడు. ఆ ఫొటోలోని యువ బ్రహ్మానందం అమ్మాయికి నచ్చుతాడు. పెళ్లి చూపులకు వెళ్లిన సమయంలో వయసు మళ్లిన బ్రహ్మానందాన్ని చూసి ఆ అమ్మాయి షాక్ అవుతుంది. పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తుంది. కొంచెం అటు, ఇటుగా ఇలాంటి సంఘటనే పంజాబ్‌లో చోటుచేసుకుంది. పెళ్లి మండపంలో పెళ్లి కుమారుడిని తొలిసారి చూసిన పెళ్లి కూతురు అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది.
పెళ్లి చూపుల కోసం పంపిన ఫొటోలోని వ్యక్తికి .. పెళ్లి కుమారుడికి పోలికలు లేవంటూ పెళ్లి క్యాన్సిల్ చేసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఛతర్‌ఘర్ ప్రాంతానికి చెందిన యువకుడికి పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరింది. పెళ్లి జరగాల్సిన రోజు రానే వచ్చింది. పెళ్లి మండపంలో వధువు తొలిసారి వరుడిని చూసింది.
పెళ్లి చూపులకు పంపిన ఫొటోలోని వ్యక్తికి.. వరుడికి ఎలాంటి పోలికలు లేవంటూ పెళ్లి క్యాన్సిల్ చేసింది. వేరే వ్యక్తి ఫొటో పంపి తనను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. విషయం పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగించారు. సమస్య కేసుల వరకు వెళ్లకుండా ఇరు కుటుంబాలు రాజీకి వచ్చాయి. కానీ, పెళ్లి మాత్రం జరగలేదు.
ఇవి కూడా చదవండి
విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ యూ-టర్న్.. 24 గంటల్లోనే ఆదేశాలు వెనక్కి
నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం