Share News

ఇంట్లోకి చొరబడ్డ 7 అడుగుల మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Aug 18 , 2026 | 02:45 PM

ఏడు అడుగుల మొసలి ఓ ఇంట్లోకి చొరబడింది. ఇంట్లో కొన్ని గంటల పాటు అలజడి సృష్టించింది. దాన్ని చూసిన ఆ ఇంటి సభ్యులు భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. ఈ సంఘటన గోవాలో చోటుచేసుకుంది.

ఇంట్లోకి చొరబడ్డ 7 అడుగుల మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే..
Goa crocodile rescue

ఇంటర్‌నెట్ డెస్క్: ఏడు అడుగుల మొసలి ఓ ఇంట్లోకి చొరబడింది. ఇంట్లో కొన్ని గంటల పాటు అలజడి సృష్టించింది. దాన్ని చూసిన ఆ ఇంటి సభ్యులు భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. ఈ సంఘటన గోవాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖందేపర్ జిల్లాలోని ఓ ఇంట్లోకి ఏడు అడుగుల మొసలి ప్రవేశించింది. దాన్ని చూసిన కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. దాడి చేస్తుందేమోనన్న భయంతో ఇంటినుంచి దూరంగా పరుగులు తీశారు. తమ ఏరియాలోని ఇంట్లోకి మొసలి వచ్చిందని తెలియగానే.. జనం పెద్ద సంఖ్యలో ఆ ఇంటి దగ్గర గుమిగూడారు.


దూరం నుంచి దాని చూడసాగారు. జనం అరుపుల కారణంగా ఆ మొసలి భయపడిపోయింది. అటు, ఇటు పరిగెత్త సాగింది. స్థానికులు వైల్డ్ లైఫ్ రెస్క్యూయర్ చరణ్ దేశాయ్‌కి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అతడు ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు. ఎంతో చాకచక్యంగా మొసలిని బంధించాడు. దాన్ని సురక్షితంగా నీటిలో వదిలేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ఆ ఇంటి సభ్యులు అదృష్టవంతులు. నిద్రపోయినప్పుడు వచ్చుంటే కచ్చితంగా తినేసేది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

వన్ వే కి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదములు: సీపీ సజ్జనార్

మద్యం మత్తులో గొడవ.. యువకుడి దారుణ హత్య

Updated Date - Aug 18 , 2026 | 03:00 PM