Share News

వన్ వే కి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదములు: సీపీ సజ్జనార్

ABN , Publish Date - Aug 18 , 2026 | 02:30 PM

హెచ్- సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వన్ వే కి సహకారం అందిస్తున్నందుకు సీపీ సజ్జనార్ ధన్యవాదములు తెలిపారు.

  వన్  వే కి  సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదములు: సీపీ సజ్జనార్
Hyderabad KBR Park one way

హైదరాబాద్, ఆగస్టు 18: హెచ్- సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్‌ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఇవాళ్టి(మంగళవారం) నుంచి ఈ పార్కు చుట్టూ వన్ వే చేశామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో చాలామంది ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు.


'కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే కి సహకారం అందిస్తున్నందుకు అందరికి ధన్యవాదములు. అగ్రసేన్ చౌరస్తా రోడ్ నం 45, చెక్ పోస్ట్, వెంకటగిరి దగ్గర కాస్త ఇబ్బంది కలిగింది. డ్రోన్స్ ద్వారా కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్నాము. ఇంకా కొన్ని చోట్ల సూచికలు పెట్టాల్సి ఉంది. సాంకేతికతను ఉపయోగించి ఇంకా ఎటువంటి మార్పులు చేయాలో చూస్తాం. ముఖ్యంగా కొంత మంది సూచనలు పాటించకుండా వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఇచ్చే సూచనలు పాటిస్తూ వాహనదారులు ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాము' అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

22-A పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించబోం: మంత్రి పొంగులేటి

నటి అనసూయకు బిగ్ షాక్..

హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య

Updated Date - Aug 18 , 2026 | 02:30 PM