మద్యం మత్తులో గొడవ.. యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Aug 18 , 2026 | 02:10 PM
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో స్నేహితులే అతడిని కిరాతకంగా చంపేశారు. రివర్స్ కేఫ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
రంగారెడ్డి, ఆగస్టు 18: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో స్నేహితులే అతడిని కిరాతకంగా చంపేశారు. రివర్స్ కేఫ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు బీహార్‌కు చెందిన అనికేత్‌గా గుర్తించారు. అనికేత్.. తన స్నేహితులు రోహిత్, రాహుల్, అంకిత్‌లతో కలిసి మద్యం సేవించాడు. ఈ సమయంలో స్నేహితుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రాహుల్.. అనికేత్ తల వెనుక భాగంలో ఐరన్ రాడ్‌తో బలంగా కొట్టాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
అపస్మారకస్థితిలో ఉన్న యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అనికేత్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణను వేగవంతం చేశారు.
ఇవి కూడా చదవండి...
జ్వరంతో ఆస్పత్రిలో చేరిన మహిళ మృతి.. బంధువుల ఆందోళన
మీరు చేసిన తప్పులకి ప్రజలకు ఎందుకు శిక్ష.. పొంగులేటిపై హరీశ్ ఫైర్
Read Latest AP News And Telugu News