చెడిపోయిన ప్రతి మొక్కకు వెయ్యి సాయం.. కొత్త మొక్కలు పెట్టిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:49 AM
దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని.. ఆ జిల్లాకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు.
అమరావతి, ఆగస్టు 18: దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని.. ఆ జిల్లాకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొబ్బరి సాగుకు సంబంధించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కొబ్బరి సాగులో 10వేల హెక్టార్లలోని కొబ్బరితోటలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రతి చెడిపోయిన మొక్కకు వెయ్యి సాయం చేసి కొత్తమొక్కలు పెట్టించాలనే ప్రతిపాదన ఉందన్నారు.
డ్రెయిన్‌లు శుభ్రం చేయకపోతే ఎంత పెట్టుబడి పెట్టినా, కొత్త మొక్కలు నాటినా ఫలితాలు ఉండదని మంత్రి తెలిపారు. అందుకే మొదటి దశలో శంకరగుప్తం కాలువ పూడిక తీస్తే రెండు, మూడు నియోజకవర్గాల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. కొత్త ప్లాంటేషన్‌కు వీబీ జీ రాంజీ పథకం కింద కేంద్రంలోని కోకో బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. మొత్తం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని కోనసీమలో కొత్తమొక్కలు పెట్టిస్తామమని చెప్పారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పినట్లు అంతర పంటలు వేయాలని రైతులకు సూచించారు. కొబ్బరితోటల్లో కోకో, అరటి, అంతర పంటలు వేయొచ్చని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ మండలిలో పోడియం వద్ద బల్లలు చరుస్తూ వైసీపీ ఆందోళన.. సభ వాయిదా
స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్
Read Latest AP News And Telugu News