Share News

స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:18 AM

ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్
AP Assembly

అమరావతి, ఆగస్టు 18: ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 835 ప్రైవేట్ స్లీపర్ బస్సులు నమోదయ్యాయన్నారు. స్లీపర్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, కేంద్ర మోటారు వాహనాల రూల్‌ 128 నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలకు కఠిన నియమ నిబంధనలు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


పోర్టులు, హార్బర్ల పురోగతిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం..

ఏపీలో నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గౌతు శిరీష, కాగిత కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 4 ప్రతిపాదిత పోర్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. రామాయపట్నం(81.45%), మచిలీపట్నం(59.24%), మూలాపేట(76.17%), కాకినాడ గేట్‌వే(33.04%) మేర పోర్టుల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని చెప్పారు. అలాగే, రాష్ట్రంలో ప్రతిపాదిత 7 ఫిషింగ్ హార్బర్లలో ప్రస్తుతం 4 నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. జువ్వలదిన్నె (97.98%), నిజాంపట్నం (81.61%), మచిలీపట్నం(71.96%), ఉప్పాడ (86.24%) మేర ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

మత్స్యకారుల గల్లంతు ఘటన.. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ సీఎం ఆదేశాలు

ఏపీ మండలిలో పోడియం వద్ద బల్లలు చరుస్తూ వైసీపీ ఆందోళన.. సభ వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 11:26 AM