Home » Vijayawada
విజయవాడ రైల్వేస్టేషన్‌లో ‘వందేభారత్’ ఎక్స్‌ప్రెస్ రైలులో సీ4 కోచ్‌లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైల్వే కోచ్ నుంచి దిగిపోయారు. రైల్వేస్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి.. మంటలను అదుపు చేశారు.
విజయవాడలో కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణలపై స్టే విధించాలన్న అంశాన్ని గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రికీలాద్రిపై దుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఈజీ పొందేందుకు ఏటీఎం మెషిన్లను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం లడ్డూ ఏటీఎంను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రారంభించారు.
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్‌గా ఎంపికైన మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థన్ రావు నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును వారం రోజుల పాటు మూసివేయనున్నారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఘాట్ రోడ్‌కు మరమ్మతు పనులు చేపట్టారు.
దసరా మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఈ మేరకు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం సహా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఘాట్ రోడ్ మరమ్మతు పనులు చేపట్టనున్నారు అధికారులు.
విజయవాడ జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రేపు(సోమవారం)జరిగే డీఎస్సీ ర్యాలీకి అనుమతి లేదని.. పోలీసుల సూచనలకు విరుద్ధంగా ఎవరైనా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని విజయవాడ డీఎస్పీ కృష్ణకాంత్ పటేల్ హెచ్చరించారు.
మహాకవి బోయి భీమన్న ప్రాతఃస్మరణీయుడని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈరోజు విజయవాడలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహాకవి బోయి భీమన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
మహిళను రహస్య వివాహం చేసుకున్న ఓ వ్యక్తి ఆపై ముఖం చాటేసిన ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. దీంతో తనకు న్యాయం కావాలంటూ బాధితురాలు అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 వసంతాల ప్రజా సేవను పూర్తి చేసుకున్నారని బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు.