Share News

Raj Kasireddy: విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రాజ్‌ కసిరెడ్డి..

ABN , Publish Date - Jan 10 , 2026 | 01:37 PM

లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌‌ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారిని జైలు అధికారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు..

Raj Kasireddy: విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రాజ్‌ కసిరెడ్డి..
Raj Kasireddy

విజయవాడ, జనవరి 10: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (లిక్కర్ స్కామ్) కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా ఆయన ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్య చికిత్స నిమిత్తం జైలు అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా విచారణల సమయంలో రాజ్ కసిరెడ్డిని అక్కడికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన సంగతి తెలిసిందే.


మంగళగిరి ఎయిమ్స్‌కు చెవిరెడ్డి..

chevireddy-bhaskar-reddy-1.jpg

ఇక ఇదే కేసులోని మరో నిందితుడు.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కూడా వెరికోజ్ వెయిన్స్ (varicose veins) సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను చికిత్స కోసం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు కూడా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కోర్టు ఆదేశాల మేరకు వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో సిట్, ఈడీ మరింత లోతుగా విచారిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...

నేను ఉన్నంత కాలం చైనా ఆ పని చేస్తుందనుకోను: డొనాల్డ్ ట్రంప్

ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 10 , 2026 | 02:07 PM