సంక్రాంతి వేళ బొమ్మల కొలువు..

ABN, Publish Date - Jan 12 , 2026 | 09:00 PM

విజయవాడలో బొమ్మల కొలువు కొలువుతీరింది. స్థానిక విజయశ్రీ అనే మహిళ దేవీ పురాణం, భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది.. నెలలపాటు శ్రమించి ఈ బొమ్మల కొలువు తీర్చిదిద్దారు. దేవి బాల్యం, బాలిక, స్త్రీ, మోక్ష దశలను చిత్రీకరించారు.

విజయవాడ, జనవరి 12: సంక్రాంతి పండుగ సమయంలో విజయవాడలో బొమ్మల కొలువు (Bommala Koluvu) కొలువుతీరింది. స్థానిక విజయశ్రీ అనే మహిళ స్వయంగా తయారు చేసిన బొమ్మల కొలువును అద్భుతంగా తీర్చిదిద్దారు. దేవీ పురాణం, భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది.. పొందుపరిచిన ఈ బొమ్మలు దేవి బాల్యం, బాలిక, స్త్రీ, మోక్ష దశలను చిత్రీకరించారు. ఇందులో అద్వైత దర్శనం, శంకరాచార్య తపస్సు, కామాక్షి అమ్మవారి మామిడి చెట్టు కింద తపస్సు వంటి కథలు కూడా భాగమయ్యాయి. విజయశ్రీ నెలల తరబడి కృషి చేసి థర్మోకోల్, వైర్, లైట్ సాయిల్ వంటి మెటీరియల్స్‌తో ఈ బొమ్మలను తయారు చేశారు. భవిష్యత్ తరాలకు సంస్కృతి, సంప్రదాయాలను అందజేయాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నం చేశానని విజయశ్రీ చెప్పారు. మహాలక్ష్మి ఆశీస్సులు, సాంస్కృతిక చరిత్రను ఈ కొలువు కళ్లకు కట్టింది. సంక్రాంతి సమయంలో ఇలాంటి సృజనాత్మక ప్రదర్శనలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.

Updated at - Jan 12 , 2026 | 09:21 PM