సంక్రాంతి ఎఫెక్ట్.. విజయవాడ బస్టాండ్‌లో రద్దీ
ABN, Publish Date - Jan 11 , 2026 | 12:44 PM
సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న వారు పల్లె బాట పడుతున్నారు. దీంతో ఏపీలోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది.
విజయవాడ, జనవరి 11: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. పండగను కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న వారు పల్లె బాట పడుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన బస్ స్టేషన్లలో రద్దీ నెలకొంది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు విజయవాడలో దిగి.. తమ గ్రామాలకు వెళ్తుంటారు. ఇక ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 150 బస్సులను విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి...
నెల్లూరు ఓఆర్ఆర్‌పై మంత్రి నారాయణ క్లారిటీ..
స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలు సాధించాలి: మంత్రి సత్యకుమార్
Updated at - Jan 11 , 2026 | 01:10 PM