Home » Vijayawada
విజయవాడలో మావోల కలకలం రేగడంతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు కొత్త ఆటోనగర్ ను ఆధీనంలోకి తీసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు.
హర్యానాలో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారని తేలిందని షర్మిల తెలిపారు. సర్వేలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇచ్చాయని గుర్తుచేశారు. అయినా బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధి బయట పెట్టారన్నారు.
జగన్.. రైతుల మీదకు దండయాత్రకు వెళ్లారని బుద్దా వెంకన్న అన్నారు. ఓడించారనే అక్కసుతో హేళనగా చూసేందుకు వెళ్లారంటూ మండిపడ్డారు. తుఫాను సమయంలో అసలు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
ఆదరణ-3 పథకం అమలుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. విజయవాడలో ఇవాళ(సోమవారం నాడు) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ఆదరణ-3 పథకం అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అలానే ఈ పథకానికి రూ. వెయ్యి కోట్లు వెచ్చించబోతున్నట్లు మంత్రి చెప్పారు.
ఆస్పత్రి వద్ద జోగి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో ఆస్పత్రి అద్దాలను జోగి అనుచరులు ధ్వంసం చేశారు.
నాటి నిర్ణయాల వల్ల అమరావతి అనేక కష్టాలకు గురైందని ఎన్వీ రమణ తెలిపారు. కష్టకాలంలో విట్ లాంటి యూనివర్సిటీ నిలబడిందన్నారు.
డ్వాక్రాలోని మహిళా చిరు వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు పాలకవర్గం పాటించలేదు. స్కీమ్ అమలు చేయలేమని, రూ.1.16 కోట్లు కేటాయించలేమని అక్టోబర్ 8న తీర్మానం చేసింది.
విజయవాడ నగర ప్రజలకు జిల్లా ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు. మంగళవారం విజయవాడలో అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జిల్లా అధికారులు హెచ్చరించారు.
చికెన్‌ను లొట్టలేసుకుంటూ తింటున్నారా..? అయితే కాస్త ఆగండి. హోటల్లో అయినా, ఇంట్లో అయినా మీరు తినే చికెన్ ఎంత వరకు నాణ్యమైనదో తెలుసుకున్న తరువాతనే ఆరగించండి. కుళ్లిన, నిల్వ ఉన్న చికెన్ ను మీకు అమ్మి చీటింగ్..