Share News

Dense Fog Vijayawada: విజయవాడ-హైదరాబాద్ హైవేను కమ్మేసిన పొగమంచు, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం

ABN , Publish Date - Jan 19 , 2026 | 08:59 AM

విజయవాడ-హైదరాబాద్ హైవేను పొగమంచు కమ్మేసింది. దీనివల్ల వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 20 మీటర్ల ముందు ఏముందో తెలియని పరిస్థితి. సంక్రాంతి పండుగ అనంతరం పట్టణాలు, నగరాలకు చేరుకుంటున్న వారు చాలా నెమ్మదిగా వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఎదురైంది.

Dense Fog Vijayawada: విజయవాడ-హైదరాబాద్ హైవేను కమ్మేసిన పొగమంచు, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం
Dense fog covered the Vijayawada–Hyderabad National Highway

నకిరేకల్, జనవరి 19: సంక్రాంతి సంబరాలు ముగిసిన తర్వాత గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు తిరిగి వెళ్లే చాలామంది ఈ తెల్లవారుజామున బయలుదేరారు. అయితే.. దారి పొడవునా తీవ్రమైన పొగమంచు రహదారిని కనిపించకుండా చేసింది.

నకిరేకల్ సమీపంలోని NH-65(హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి) పూర్తిగా పొగమంచుతో కప్పుకుపోయింది. ఉదయం నుంచే దట్టమైన పొగమంచు రహదారిని పూర్తిగా కమ్మేసింది. కొంచెం దూరంలో ఉన్న వాహనాలూ కనిపించనంత దట్టంగా పొగమంచు అల్లుకుంది. దీంతో వాహనదారులు చాలా జాగ్రత్తగా, చాలా నెమ్మదిగా ప్రయాణం చేయాల్సి వస్తోంది.


హైవే మీద పొగమంచు కారణంగా బైక్‌లు, కార్లు, బస్సులు అన్నీ చాలా నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి తలెత్తింది. హెడ్‌లైట్స్ పూర్తిస్థాయిలో వేసినా.. 20-30 మీటర్ల దూరం కూడా స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ హైవేపై రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి దాపురించింది.

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలోనూ దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై వెళ్తున్న వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్ల మీద వాహనాలు కనిపించకపోవడంతో అతి నెమ్మదిగా వాహనాలు కదలాల్సిన పరిస్థితి తలెత్తింది.

Fog.jpg


ఇలాంటి పరిస్థితుల్లో వహించాల్సిన జాగ్రత్తలు:

  • హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు తప్పనిసరిగా వాడాలి

  • అతి వేగంగా వెళ్లకూడదు

  • సడెన్ బ్రేక్ వేయకూడదు, ఓవర్‌టేక్ చేయకూడదు

  • హారన్ వాడటం సురక్షితం


పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. విజయవాడ ఎయిర్ పోర్ట్‌లో పలు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఈ ఉదయం చేరుకోవాల్సిన హైదరాబాద్, చెన్నై ఇండిగో సర్వీసులు గంట ఆలస్యం కాగా, ఢిల్లీ నుంచి రావాల్సిన ఎయిరిండియా విమానం గంట ఆలస్యమైంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Deputy Chief Minister Bhatti Vikramarka: నైనీ టెండర్లు రద్దు

CM Revanth Reddy Vows to Defeat TRS: టీడీపీని దెబ్బతీసిన బీఆర్‌ఎస్‌‌ను బొందపెట్టాలి!

Updated Date - Jan 19 , 2026 | 10:55 AM