Home » Videos
బీఆర్ఎస్ పార్టీలో అన్న చెల్లెలు మధ్య పోటీ తీవ్రమైందా? ఆదిపత్యాన్ని పెంచుకొంనేందుకు ఒకరికొకరు తమ మాటల్లో, చేతల్లో స్పీడ్ పెంచుతోన్నారా? ప్రజల అటెన్షన్ కోసం మా నాన్న అంత మంచోళ్లం కాదని పదే పదే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు?
గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని ఆంధ్రజ్యోతి యూనిట్ ఆఫీస్‌లో లక్కీ డ్రా నిర్వహించారు. డీజీఎం రామచంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీవీఐటీ విద్య సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు.ఆంధ్రజ్యోతి పాఠకులకు సంస్థ తరఫున బహుమతులు అందజేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విజేతలకు విద్యాసాగర్ శుభాకాంక్షలు తెలిపారు.
జీవితంలో ఒక్కసారైనా మానస సరోవర్ యాత్ర చేయాలనుకుంటారు శివభక్తులు. అయితే ఏడేళ్ల నుంచి ఆ యాత్రను ఆపేశారు. మళ్లీ ఇప్పుడు ఆ యాత్రను పునరుద్దరించేందుకు తహతహలాడుతోంది చైనా. భారత్ సైతం ఓకే అంది. అతి త్వరలో ఈ యాత్ర ప్రారంభంకాబోతుంది.
చైనా మారిపోయింది. కాదు మారిపోయేలా చేస్తున్నారు ట్రంప్.అవును. ఒకప్పుడు పొరుగు దేశాన్ని హీనంగా చూసిన డ్రాగన్.. ఇప్పుడు చాలా గౌరవం ఇస్తుంది. స్నేహ హస్తం చాచుతోంది. అటు చైనాను ఏకాకిని చేసేందుకు ట్రంప్ చేయని ప్రయత్నం అంటూ లేదు. టారిఫ్‌ల ఆదాయం పెరిగితే.. అమెరికాలో ఇన్‌కంటాక్స్ ఎత్తివేస్తామంటున్నారు.
కడప పోలీస్ స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. గంజాయి కేసులో అరెస్ట్ అయిన సోను అనే వ్యక్తి స్టేషన్ బాత్రూమ్ కిటికీ గ్రిల్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే, పోలీసులే అతడిని చంపేశారని సోను కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దుకాణాల్లో లిక్కర్ విక్రయాలన్నీ డైరెక్ట్ క్యాష్ రూపంలోనే లావాదేవీలు జరిగాయి. డిజిటల్ కరెన్సీలో నగదు చెల్లింపులు ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా.. డైరెక్ట్‌గా క్యాష్ రూపంలోనే నగదు తీసుకొనే వారు. ఈ విక్రయాల్లో 20 శాతాన్ని అంటే.. ఒక నెలకు రాజ్ కసిరెడ్డి కమీషన్ రూ. 60 కోట్లు తీసుకొనేవాడన్నారు. ప్రతి మద్యం కేసు నుంచి రూ. 150 నుంచి రూ. 450 దాకా వసూల్ చేసేవాడు. ఆ నగదు మొత్తంలో కొంత భాగాన్ని రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టాడు. అలాగే స్పై అనే చిత్రాన్ని తీశాడు. టాలీవుడ్లో కొంత మందిని పెట్టుబడులు సైతం పెట్టారు. అలాగే నగల దుకాణాల నుంచి సుమారు రూ. 1000 కోట్లు ట్రాన్స్ ఫర్ అయినాయి.
ఎవరైనా బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తే.. వారి పేర్లు పింక్ బుక్‌లో రాసుకొంటామని.. ఎవరి వదిలి పెట్టేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ సన్నాహాక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మంచివాడు అయి ఉండవచ్చు. కానీ తాను మాత్రం కొంచెం రౌడీ టైప్ అని చెప్పుకొచ్చారు.
రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు క్రమంగా ఊపందుకుంటున్నాయి. మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ..
ఇందిరామ్మ రాజ్యంలో ఆనాడు అసైన్డ్ భూములు దాదాపు 25 లక్షల ఎకరాలు పేదలకు పంచి పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రూపాయి రూపాయి కూడబెట్టి.. కొద్ది పాటి భూమి కొనుగోలు చేసిన వారు.. తమ భూమి తమది కానదన్నప్పుడు వారు పడే అవేదన అంత ఇంత కాదని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 14వ తేదీన తెలంగాణలో భూ భారతి పోర్టల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోర్టల్‌ను తెలంగాణ ప్రజలకు ఆయన ఆకింతమిచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్లు మరుగున పడ్డాయని.. కూటమి ప్రభుత్వంలో తిరిగి అవి జీవం పోసుకొంటున్నాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు పేర్కొన్నారు. తిరుపతి సమీపంలో సంస్కృత విద్యా పీఠంలో జరిగిన అంబేద్కర్ జయంతిలో ఆయన పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందంటూ ఆయన మండిపడ్డారు.