తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ ఫైర్ న్యూస్.. టాప్ అప్‌డేట్స్..

ABN, Publish Date - Mar 06 , 2026 | 11:38 AM

ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని.. ఇప్పుడు పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి చర్చిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై డ్రాఫ్ట్ పాలసీ రూపొందిస్తున్నామని..

ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని.. ఇప్పుడు పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి చర్చిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై డ్రాఫ్ట్ పాలసీ రూపొందిస్తున్నామని.. నెల రోజుల పాటు చర్చ తరువాత తుది రూపు ఇస్తామని సీఎం చెప్పారు. పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై శాసనసభలో సీఎం ప్రకటన చేశారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని.. 2040 నాటికి వృద్ధాప్యం ఎక్కువగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఒకటిన్నర శాతంగా ఉందని.. ఇది 2.1 శాతంగా ఉంటే సుస్థిర ప్రగతి ఉంటుందన్నారు. దేశంలో కంటే రాష్ట్రంలోనే ఎక్కువ వృద్ధాప్యం ఉందన్నారు. మరిన్ని ర్యాపిడ్ ఫైర్ వార్తల కోసం పూర్తి వీడియోను చూసేయండి..

Updated at - Mar 06 , 2026 | 11:38 AM