Home » Videos
దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని అమరావతిలో ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్తరాది మొత్తం చలితో వణుకుతోంది. ఇంటి నుంచి బయటకు రావడానికే బయపడే పరిస్థితులు నెలకున్నాయి. హిమాలయాల గురించి వేరే చెప్పనక్కర్లేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడాది పాలన.. ప్రపంచాన్ని అల్లకల్లోలంగా మార్చేసింది. ఆయన ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌లా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వసంత పంచమి సందర్భంగా బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. అక్షరాభ్యాస మండపాలు కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్ట్యా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి.. అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది.
సిట్ నుండి సేకరించిన సమాచారంతోపాటు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకుని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితోపాటు మరో ఇద్దరిని ఈడీ విచారిస్తోంది.
పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే.. వారికి మంచి విద్యా బుద్ధులుండాలి. అందుకోసం చిన్నారులను వసంత పంచమి వేళ వారి తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ రోజు అక్షరాభ్యాసం చేసిన చిన్నారుల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని ఓ యువతి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టింది. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూర్‌లో జరిగింది.
హైదరాబాద్ గాంధీభవన్‌లో నిజామాబాద్ మున్సిపల్ సన్నాహాక సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఈ సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అలిగారు.
గ్రామీణ ఆటగాళ్లను గుర్తించడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఘోరంగా విఫలమైందని జనరల్ సెక్రటరీ గురవారెడ్డి మండిపడ్డారు.