మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించుకోవాలంటే.. ఇవిగో సింపుల్ చిట్కాలు..
ABN , Publish Date - Mar 22 , 2026 | 07:42 AM
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అందరిని వేధిస్తున్న అనారోగ్య సమస్య హై బీపీ. దీనిని మందులు లేకుండా నియంత్రించేందుకు ఇవిగో సింపుల్ చిట్కాలు..
ప్రపంచమంతా నేడు తీవ్ర ఒత్తిడితో కూడిన జీవనశైలితోపాటు ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. దీంతో అధిక రక్తపోటు ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. దీనిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. అది గుండె జబ్బులు, పక్షవాతం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే సరైన ఆహారం తీసుకోవడం, జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉప్పు వాడకాన్ని బాగా..
ఆధిక రక్తపోటుకు ప్రధాన కారణం ఉప్పును ఎక్కువగా వినియోగించడమే. రోజుకు ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవడం ఉత్తమం. ప్రాసెస్ చేసిన ఆహారం. ఊరగాయలు, ఖర్జూరం వంటి వాటికి దూరం ఉండాలి.
ఆహారంగా వీటిని..
అరటిపండు, పాలకూర, చిలకడదుంప, నారింజ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేయడమే కాకుండా రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.
ధాన్యాలు, పీచు పదార్థాలు ఉన్న ఆహారం..
తెల్ల బియ్యానికి బదులుగా రాగి, క్వినోనా లేదా ఓట్స్ వంటి ధాన్యాలను వాడాలి. మీ రోజు వారీ ఆహారంలో ఆకుపచ్చ క్యాబేజీ, బ్రోకలీ, తాజా పండ్లను చేర్చుకోవాలి.
జీవనశైలిలో మార్పులు..
శారీరక కార్యకలాపాలు
ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు (అర గంట) పాటు వేగంగా నడవాలి. ఈత కొట్టడం లేదా సైకిల్ తొక్కడం అలవాటు చేసుకోవాలి. ఇది గుండె కండరాలను బలపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఒత్తిడి తగ్గించుకోవడానికి..
ఈ రోజుల్లో రక్తపోటు పెరగడానికి మానసిక ఒత్తిడే ప్రధాన కారణం. దీనిని తగ్గించుకోవడానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం సాధన చేయాలి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంతోపాటు రక్తపోటును సమతుల్యంగా ఉంచుతుంది.
బరువు నియంత్రణ..
శరీర బరువు పెరిగే కొద్దీ రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ ఎత్తుకు తగిన బరువును కాపాడుకోవడం చాలా అవసరం.
చెడు అలవాట్లకు దూరంగా..
ధూమపానం, మద్యపానం వల్ల గుండె రక్తనాళాల దెబ్బతింటాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తక్షణం మానేడం ఉత్తమం.
నిద్ర చాలా చాలా ముఖ్యం.
ఆధిక రక్తపోటును నియంత్రించడంలో నిద్ర కీలక పాత్ర. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర పొవడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉండి.. రక్తపోటు స్థిరంగా ఉంటుంది. ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల రక్తనాళాలు సంకోచించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
అలాగే రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరంలో నుంచి విషపదార్థాలు బయటకు వెళ్లిపోయి.. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలతోపాటు జీవన విధానంలో చిన్న మార్పులతో అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు.
రక్త పరీక్ష..
మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. వైద్యుడు సూచించిన విధంగా ముందులు తీసుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలిని అలవరచ్చుకోవడం ద్వారా మీరు దీర్ఘకాలంగా ఆరోగ్యంగా ఉంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Health News And Telugu News