హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో ముసలం
ABN, Publish Date - Mar 21 , 2026 | 12:22 PM
హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్ఎస్ శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయనకు వ్యతిరేకంగా పలువురు నేతలు, కార్యకర్తలు జమ్మికుంటలో రహస్య సమావేశం నిర్వహించారు.
కరీంనగర్: హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్ఎస్ శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయనకు వ్యతిరేకంగా పలువురు నేతలు, కార్యకర్తలు జమ్మికుంటలో రహస్య సమావేశం నిర్వహించారు. కౌశిక్‌రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే.. ఆ పార్టీ నాశనం అంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆయనతో వేగలేమని.. కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు పలువురు బీఆర్ఎస్ నేతలు. రేపో మాపో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్ఎస్ అసంతృప్త నేతలు సిద్ధమవుతున్నారు.
Updated at - Mar 21 , 2026 | 12:22 PM