టీడీపీలో కొత్త ఒరవడి.. కార్యకర్తలకు సన్మానం..

ABN, Publish Date - Apr 01 , 2026 | 11:00 AM

తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఎన్నో వ్యవస్థాపక దినోత్సవాలు నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేయడం, సమావేశాలు నిర్వహించడం, పార్టీ గత చరిత్రపై ఉపన్యాసాలు ఇవ్వడం అనవాయితీగా మారింది. కానీ ఈ సారి అందుకు భిన్నంగా..

తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఎన్నో వ్యవస్థాపక దినోత్సవాలు నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేయడం, సమావేశాలు నిర్వహించడం, పార్టీ గత చరిత్రపై ఉపన్యాసాలు ఇవ్వడం అనవాయితీగా మారింది. కానీ ఈ సారి అందుకు భిన్నంగా వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో వేదికపై నాయకులను దించేసి కార్యకర్తలను కూర్చోబెట్టారు. ఇక అన్నింటికంటే వినూత్నంగా పార్టీలో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారిని గుర్తించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ నేరుగా వారికి ఫోన్ చేసి ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. నూతన వస్త్రాలు పెట్టి మరీ సత్కరించారు. వినూత్నంగా, ఆహ్లాదకరంగా జరిగిన ఈ లంచ్ కార్యక్రమంలో చంద్రబాబుతో పార్టీ సీనియర్ కార్యకర్తలు ఏం మాట్లారు.. లోకేష్, చంద్రబాబు ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

Updated at - Apr 01 , 2026 | 11:00 AM