Home » Uttam Kumar Reddy Nalamada
కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల కింద పంటల సాగుకు అనువైన పరిస్థితులున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. వరదల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమన్నారు.
హుజుర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని జానపహాడ్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. అవకతవకల విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సదరు కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీబీ కేసు నమోదు చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటోందన్నారు. కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం, నీళ్ల విలువ, రైతుల గురించి తెలియదన్న హరీశ్ రావు..
తెలంగాణలో 'రప్పా రప్పా' రాజకీయాలకు తెరలేపారు. సూర్యాపేటలో కలెక్టరేట్‌కు వెళ్ళేదారిలో కాంగ్రెస్ రప్పా- రప్పా అంటూ మంత్రి ఉత్తమ్ యువశక్తి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇంజనీర్లందరూ క్షేత్రస్థాయిలోని రిజర్వాయర్లు, కాల్వలు, చెరువుల వద్దే మకాం వేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొత్త పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను ఆధునికీకరించాలని, సకాలంలో ప్రాజెక్టుల డిజైన్లు అందించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ తవ్వకం పనుల పునరుద్ధరణకు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సింగూరు కట్ట రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ప్రమాదంలో సింగూరు రిజర్వాయర్’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు.
తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి ఇప్పటివరకు 30 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేశామని, ఈ ఏడాది మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
మంత్రివర్గం ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కేసీఆర్, హరీశ్‌లు తెలంగాణ ప్రజలను మోసం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.