Home » TTD
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అహంకారంతో మాట్లాడితే ఏ దేవుడు కూడా క్షమించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కల్తీ నెయ్యి, పరకామణి దొంగతనంపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ, పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది.
టీటీడీ పరకామణి కేసుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని.. ఈ కేసులో దొరికింది 9 డాలర్లు అని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పరకామణి చోరీ కేసుపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం ఈ కేసుపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి కేసును అక్టోబర్ 27న సీఐడీ విచారణ చేపట్టింది. సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించి పలువురిని సీఐడీ ప్రశ్నించింది.
తిరుమలలో శ్రీవారి బంగారు డాలర్ల కొరత ఏర్పడింది. వారం రోజులుగా డాలర్లు లేకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దిత్వా తుఫాను వానలతో తిరుమలలోని జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. అక్టోబరులో కురిసిన వర్షాలకే తిరుమలలోని పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పుసుపుధార డ్యాములు 98 శాతం నిండిపోయాయి.
దిత్వా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. దిత్వా తుఫాను నేపథ్యంలో భక్తులకు, జిల్లా ప్రజలకు భద్రతా సూచనలు సూచించారు .
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు అద్భుతమైన తిరుపతి, తిరుమల ఫొటోలు, వీడియోలతో పాటు... దర్శన, వసతి, టీటీడీ నూతన నిర్ణయాలు, ప్రసాదాలు, చేపడుతున్న మార్పులు వంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ... సోషల్ మీడియా సేవ చేస్తున్నారు తిరుపతికి చెందిన కొందరు యువకులు.