Home » Tollywood
ప్రతి గ్రామంలో ఒక్కరిని బాగు చేస్తే వారే ఊరును బాగు చేస్తారని టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్, సినీ హీరోయిన్ మంచు లక్ష్మీప్రసన్న వ్యాఖ్యానించారు. తమ ఫౌండేషన్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు చేయూతనిస్తున్నామని వెల్లడించారు.
సినీ పరిశ్రమ కార్మికులకు వేతనాల పెంపుపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, మూడు విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తొలి విడతగా 15 శాతం, రెండో విడత 5 శాతం, మూడో విడత మరో 5 శాతం పెంచుతామని పేర్కొన్నారు.
సినీ కార్మికులకు 30శాతం వేతనాలు పెంచి, తాను త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు మీడియాకు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహించారు. తాను కార్మికుల సంఘాల నుంచి ఎవరినీ కలవలేదని ఆయన స్పష్టం చేశారు.
పుష్ప-2 మూమీ సంధ్యా థియేటర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పుష్ప పీవ్యూ షో ఘటనపై మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. విచారణలో కమిషన్ సీరియస్‌గా స్పందించింది.
రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. కొందరు నేతలు విమర్శిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. అయినప్పుటికీ సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ విమర్శలపై స్పందించనని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, సుప్రియ , మైత్రీ రవి చేరుకున్నారు. సినీ కార్మికుల బంద్ విషయంపై నిర్మాతలు చర్చిస్తున్నట్లు సమాచారం.
వేతనాలు పెంచాలని తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు డిమాండ్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫిలిమ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఇవాళ(శుక్రవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై ఫిలిమ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కావలి పట్టణంలోని స్రవంతి థియేటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ కోసం థియేటర్లో మరమ్మతులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు థియేటర్ నిర్వాహకులు..
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌కు నోటీసులు ఇవ్వడంతో బుధవారం విచారణకు హాజరయ్యారు. ప్రకాష్‌రాజ్‌ను మూడు గంటలుగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దుబాయ్‌కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.