Actress Ranga Sudha: పోలీస్ స్టేషన్‌కు నటి సుధ.. తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ..
ABN , Publish Date - Sep 08 , 2025 | 09:34 AM
టాలీవుడ్ సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
హైదరాబాద్: సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము కలసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు బయట పెడతానని గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించాడని ఆమె ఫిర్యాదులో తెలిపారు.
ప్రస్తుతం కొన్ని ట్విట్టర్ పేజీలతో పాటు రాధాకృష్ణ కూడా అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని నటి ఫిర్యాదులో తెలిపారు. దీంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా, గతంలో రాధాకృష్ణతో రంగ సుధ రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:
మరింత ఖరీదైనదిగా ఫుడ్ డెలివరీ..జీఎస్టీ కారణంగా ఫీజు పెంపు తప్పదా
బతుకు బరువు.. ఉపాధి కరువు.. నేతన్నకు ఆర్థిక కష్టాలు
For More Latest News