Tollywood Film shootings resume from tomorrow : ప్రభుత్వ జోక్యంతో టాలీవుడ్ వివాదం కొలిక్కి.. రేపటి నుంచే షూటింగ్స్
ABN , Publish Date - Aug 21 , 2025 | 09:51 PM
18 రోజుల గ్యాప్ తర్వాత టాలీవుడ్ సినిమా షూటింగ్స్ రేపటి నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో టాలీవుడ్ వివాదం కొలిక్కి వచ్చింది. లేబర్ కమిషనర్..
హైదరాబాద్, ఆగస్టు 21 : 18 రోజుల గ్యాప్ తర్వాత టాలీవుడ్ సినిమా షూటింగ్స్ రేపటి నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి. చివరికి ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో టాలీవుడ్ వివాదం కొలిక్కి వచ్చింది. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో నిర్మాతలకు, కార్మిక సంఘాల మధ్య చర్చలు ఫలించాయి. దీంతో రేపటి నుంచి షూటింగ్స్ కు వచ్చేందుకు కార్మికసంఘాలు సుముఖత వ్యక్తం చేశాయి.
ఇలా ఉండగా, సమ్మె ముగింపు పై కార్మిక భవనంలో నిర్మాతలు, ఫెడరేషన్, జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు అర్ధం చేసుకొని ముందుకు వచ్చారు. నిర్మాతలు కూడా కార్మికులకు కావలసిన వాటి కోసం ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా పరిష్కారం తీసుకురమ్మని కోరారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సీఎం గారికి ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఫెడరేషన్ అర్థం చేసుకున్నదుకు కృతజ్ఞతలు. లేబర్ కమిషనర్ గంగాధర్ చర్చలు సఫలం అయ్యేలా చేసారు. హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా చెయ్యాలని సీఎం గారి ప్లాన్ .. ఆదిశగా ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది.' అని దిల్ రాజు చెప్పారు.
ఈ సందర్భంగా లేబర్ కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ.. '30 శాతం హైక్ అనేది జరుగుతుంది. పలు డిమాండ్స్ ఉన్నాయి. మూడు నాలుగు కండిషన్స్ మీద సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. 22.5 శాతం మొత్తంగా వేతనాల పెంపు (వేతనాల రేషియోను బట్టి మారుతుంది). ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నాం. మిగతా చిన్న చిన్న సమస్యల కోసం ఈ కమిటీ. నెల రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుంది. స్ట్రైక్ లేదు ఇక రేపటి నుంచి షూటింగ్స్ కంటిన్యూ అవుతాయి.
వేతనాలు పెంచాలంటూ టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గత 16 రోజులుగా తెలుగు సినిమాల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ఫిల్మ్ చాంబర్ అటు నిర్మాతలతో, ఇటు కార్మికులతో పలుమార్లు చర్చలు జరిపింది. కార్మికులు కోరినట్లుగా 30 శాతం జీతాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోలేదు. చివరికి తాము పెట్టిన కండీషన్లకు ఒప్పుకుంటే రూ. 2 వేలలోపు జీతాలు ఉన్న వారికి పర్సంటేజీల ప్రకారం పెంచుతామని నిర్మాతలు మెట్టుదిగారు. తాజాగా వీటిపై చర్చలు సఫలం కావడంతో టాలీవుడ్ లో రేపటి నుంచి షూటింగ్స్ సందడి మొదలవబోతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News