Urvashi Rautela: నేడు ఈడీ విచారణకు నటి ఊర్వశి రౌతేలా
ABN , Publish Date - Sep 16 , 2025 | 09:00 AM
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ నటులకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ: బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ(మంగళవారం) ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి నటి ఊర్వశి రౌతేలా విచారణకు హాజరుకానున్నారు. ఊర్వశి చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి అధికారులు ప్రశ్నించనుంది. తను ప్రమోషన్ కోసం తీసుకున్న డబ్బు, లావాదేవీలు వంటి వివరాలపై ఈడీ ఆరా తీయనున్నట్లు సమాచారం. కాగా, మాజీ ఎంపీ మిమి చక్రవర్తి కూడా నిన్న(సోమవారం) ఈడీ విచారణకు హాజరయ్యారు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ నటులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే 14వ తేదీన ప్రముఖ సినీ నటి ఊర్వశి రౌతేలాకు అధికారులు నోటీసులు పంపారు. ఈనెల 16న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇవాళ ఈడీ విచారణకు హజరుకానుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం