Urvashi Rautela: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు.. ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తికి నోటీసులు
ABN, Publish Date - Sep 14 , 2025 | 10:03 PM
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ నటులకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ నటులకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటి ఊర్వశి రౌతేలాకు అధికారులు నోటీసులు పంపారు. ఈ నెల 16న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఊర్వశితో పాటు మరో నటి మిమి చక్రవర్తికి ఈనెల 15న విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.
Updated at - Sep 14 , 2025 | 10:04 PM