Share News

CM Revanth Reddy: హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తాం..

ABN , Publish Date - Sep 18 , 2025 | 07:14 AM

అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలని సిని కార్మికులను కోరారు. సినీ పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దని సూచించారు.

CM Revanth Reddy: హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తాం..
CM Revath Reddy

హైదరాబాద్: భాగ్యనగరాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏమీ కావాలో చర్చించుకుని చెప్పాలని ఆయన పేర్కొన్నారు. సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెప్పామన్నారు. సినిమా కార్మికులలో నైపుణ్యాల పెంపుకు సహకరించాల్సిందిగా నిర్మాతలను కోరినట్లు గుర్తు చేశారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తామని వివరించారు. కార్మికులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సీఎం సూచించారు.


సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం..

అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా సహకరించాలని కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలని కోరారు. సినీ పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దని హితవు పలికారు. సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. సమస్యను సమస్యగానే చూస్తా.. వ్యక్తిగత పరిచయాలను చూసుకోనని ఆయన తెలిపారు. సినిమా కార్మికుల తరుఫున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం మీది.. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని సీఎం ధీమా వ్యక్తం చేశారు.


సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్..

తాను కార్మికుల వైపు ఉంటాను.. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యమే అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమ్మె జరుగుతుంటే చూస్తూ.. ఉర్కోలేమని పేర్కొన్నారు. సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. సినీ కళాకారులకు గద్దర్ అవార్డ్ లను ఇచ్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు సినిమా వాళ్లకు అవార్డులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అయితే.. ఇన్ని ఏళ్లలో సినిమా కార్మికులను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి లేరని సీఎం రేవంత్‌ను సినీ సంఘాల నాయకులు కొనియాడుతున్నారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

Updated Date - Sep 18 , 2025 | 07:14 AM