A Tragedy In Allus House: అల్లు వారింట తీవ్ర విషాదం..
ABN , Publish Date - Aug 30 , 2025 | 08:21 AM
అల్లు వారింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అనారోగ్యం కారణంగా మృతి చెందారు.
హైదరాబాద్: అల్లు వారింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నం(94) కన్నుమూశారు. ఇవాళ(శనివారం) తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. కాగా, ఇవాళ(శనివారం) మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు, బంధువులు వెల్లడించారు.
దివంగత నటుడు అల్లు రామలింగయ్య భార్య కనకరత్నం గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబైలో అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా పనుల్లో ఉన్నారు. ఆయనకు విషయం తెలిసిన వెంటనే ముంబై నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమలో ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ తల్లి కన్నుమూయడంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు, నేతలు అల్లు కనకరత్నం మృతికి సంతాపం తెలుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి