Home » Tirupati
మొంథా తుఫాను కారణంగా రాయలచెరువుకు గండి పడి ఊరిని మొత్తం ముంచెత్తింది. భారీగా నీరు రావడంతో పెద్దఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుపతి వెళ్లే నాలుగు మెము రైళ్లు ఫిబ్రవరి 5వ తేది వరకు తిరుచానూరు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి. అరక్కోణం నుంచి తిరుపతికి ఉదయం 9.15 గంటలకు వెళ్లే రైలు తిరుచానూరు వరకు మాత్రమే వెళ్తుంది. మరుమార్గంలో, అరక్కోణం వెళ్లే మెము సాయంత్రం 3.40 గంటలకు తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది.
తిరుమలలో కొంతమంది ప్రజాప్రతినిధుల పీఆర్వోలు అధిక ధరలకు వీఐపీ బ్రేక్ దర్శనాలను అమ్ముకుంటున్నారని ఈశ్వర్(అనంతపురం) అనే భక్తుడు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శుక్రవారం పలువురు భక్తులు ఈవోతో ఫోన్‌లో సంభాషించారు.
ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్‌పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.
ట్రేడింగ్ యాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కోటిన్నర రూపాయలు కొట్టేశారు. తిరుపతిలో ఉండే చైతన్య కుమార్, వెంకటేష్‌కు ఆన్లైన్ ద్వారా ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది..
‘నా భర్తను మా అత్త, బావ చంపేశారు. పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు’ అంటూ బాధితురాలు హేమలత ఎస్పీ సుబ్బరాయుడు ఎదుట సోమవారం పీజీఆర్ఎస్లో మొర పెట్టుకున్నారు. ‘మాది వడమాలపేట మండలం ఎస్‌బీఆర్‌పురం. సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన కృష్ణకుమార్‌తో 2023లో నాకు వివాహమైంది. నా భర్తకు అన్న కిరణ్‌కుమార్, సోదరి అశ్విని ఉన్నారు.
తిరుమల శ్రీవారి వైద్య సేవలు ఇక నుంచి మరింత విస్తరించబోతున్నాయి. దేవస్థాన పరిధిలోని అన్ని హాస్పిటల్స్‌లో వాలంటర్ల మాదిరి డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందికి కూడా అవకాశం ఇవ్వనున్నారు.
నందమూరి బాలకృష్ణ ‘అఖండ2’ సినిమాకు సంబంధించి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొంతమేరకు పూర్తయిందని డ్రమ్స్ కళాకారుడు శివమణి తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
పాత సూపర్ లగ్జరీ బస్సులను ఏం చేయాలి? పర్యావరణ హితం.. సంస్థకు లాభదాయకంగా ఎలా మార్చాలి? ‘ఎలక్ట్రిక్ ఏసీ సూపర్ లగ్జరీలు’గా కన్వర్షన్ చేయడమే దీనికి పరిష్కారంగా అధికారులు ఓ నిర్ణయానికొచ్చారు. ఈ ప్రయోగం విజయవంతమైతే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులు మరిన్ని రోడ్డెక్కనున్నాయి.
పేదలకు చెందాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. పాలిష్ చేసి మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనికి చెక్‌పెట్టే దిశగా ప్రభుత్వం అత్యాధునిక విధానానికి శ్రీకారం చుట్టింది.