Share News

Woman Death at Tirupati: తిరుపతిలో ఒంటరి మహిళ అనుమానాస్పద మృతి..

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:14 PM

తిరుపతిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Woman Death at Tirupati: తిరుపతిలో ఒంటరి మహిళ అనుమానాస్పద మృతి..
Tirupati

తిరుపతి, జనవరి 12: తిరుపతిలో(Tirupati) ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని బలిజపల్లిలో మహిళ మృతిచెందింది. మృతురాలిని మల్లేశ్వరి(52)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. నాలుగు రోజుల క్రితమే మల్లేశ్వరి చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. కుటుంబంలో మనస్పర్ధల కారణంగా చాలాకాలం నుంచి భర్త, కుమారుడికి దూరంగా ఉంటూ ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది.


అయితే.. ఒంటరిగా ఉన్న ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందా? లేక అనారోగ్యం కారణంగా మృతి చెందిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలికి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ ఆత్మహత్య? హత్య? అనేది నిర్ధారించలేమని పోలీసులు వెల్లడించారు.

మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం ఎస్ఐ భక్తవత్సలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

దుర్గగుడిలో అపచార ఘటనపై ఈవో తాజా ఆదేశాలివే..

అమరావతిలో జోరుగా ల్యాండ్ పూలింగ్.. కర్లపూడిలో ప్రారంభం

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 12:22 PM