Home » Tirupati
తమిళనాడు రాష్ట్రాని చెందిన ఓ వాహనంపై అన్యమత చిహ్నాలు ఉండటాన్ని గుర్తించారు. అయితే.. ఈ వాహనం అలిపిరి టోల్గేట్ దాటి తిరుమల కొండపైకి చేరుకోవడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఒకరిని విధుల నుంచి తొలగించింది.
ర్యాపిడో.. అంటూ బైకులో ఎక్కించుకున్నాడు. దూరంగా పొదల్లోకి తీసుకెళ్లి మరికొందరు మందబాబులతో కలిసి ఆ భక్తుడిపై దాడిచేసి బంగారు గొలుసు లాక్కెళ్లారు. తిరుపతిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి అలిపిరి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
టీటీడీ పరాకమణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని శాలివాహన కుమ్మర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సతీష్ ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని పేర్కొంది.
టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ కేసులకు సంబంధించి తిరుపతిలో ముమ్మరంగా విచారణ జరుగుతోంది. ఒకవైపు సీఐడీ.. మరోవైపు సీబీఐ భాగస్వామ్యమున్న సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.
పరకామణి చోరీ కేసుపై సీఐడీ జరుపుతున్న దర్యాప్తులో టీడీపీ జోక్యం ఉండదని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను కోరారు. బుధవారం సాయంత్రం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం కాన్ఫరెన్సు హాలులో ఆయన టీడీపీ నేతలతోపాటు సీఐడీ చీఫ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ర్యాగింగ్ అనేది సరదా కాదనీ, అదొక అమానుషమైన విషయమని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఎవరైనా ఎక్కడైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్టు తమ దృష్టికి వస్తే జైలుకు పంపి కఠిన శిక్ష అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎస్వీయూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియంలో మంగళవారం స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ విభాగం ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించింది.
విజయవాడలో గత ఆదివారం జరిగిన 6వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో తిరుపతికి చెందిన ఎ.వెంకటేష్(67), సి.జయశంకర్(58) ప్రతిభ కనబరిచారు. వేర్వేరుగా బ్యాక్, బ్రేస్ట్ స్టోక్, ఫ్రీస్టయిల్ విభాగాలలో వెంకటేష్ కు నాలుగు బంగారు, జయశంకర్‌కు రెండు చొప్పున సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు.
శ్రీసిటీలో రూ.1,629 కోట్లు, నాయుడుపేటలో రూ.2,343 కోట్ల చెప్పున రూ.3,972 కోట్లతో నాలుగు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
డిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనతో తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు.
టీటీడీ చేపట్టిన వేదపారాయణ పోస్టుల ఇంటర్వ్యూల్లో తొలిరోజే వివాదం మొదలైంది. 700 పోస్టులకుగాను తిరుపతిలోని శ్వేతలో సోమవారం మొదలైన ఇంటర్వ్యూలు 16వ తేదీ వరకు జరగనున్నాయి.