Home » Tirupati
గత పాలకులు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే బీసీలకు తగిన ప్రాతినిథ్యం దక్కుతోంది. ఈ ప్రభుత్వంలోనే బీసీలకు పునర్వైభవం వచ్చింది అని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత పేర్కొన్నారు
జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీ భక్తులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలఫై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Tirumala Devotees: తిరుమల శ్రీవారిని జూన్ మాసంలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శనం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ మాసంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.
Tirupati Dead Bodies: కారులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమవడం తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కలంకారీ కళాకారుడిగా విశేష గుర్తింపు పొందిన తలిశెట్టి మోహన్, ఆయన మనవడు వేహాంత్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు.
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లావ్యాప్తంగా 5508 ప్రాంతాల్లో 8.10 లక్షల మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
అన్యమత గుర్తులతో తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య పెరిగింది. తాజాగా శుక్రవారం రెండు కార్లు తిరుమలకు చేరుకున్నాయి.
కొందరు ఆటోవాలాల ఆగడాలకు చెక్‌పెట్టేలా పోలీసులు క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొదటి దశలో తిరుపతిలోని 200 ఆటోలను డిజిటలైజేషన్ చేశారు. తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణమాచ్చారి ఆధ్వర్యంలో సోమవారం పోలీసు పరేడ్ గ్రౌండులో ఆటోల డిజిటలైజేషన్ కార్యక్రమం చేపట్టారు.
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించి సెప్టెంబరు నెల లక్కీడిప్ కోటాను టీటీడీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Tirupati Land Grabbers: తిరుచానూరులో నాగాలమ్మ ఆలయాన్ని భూకబ్జాదారులు నేలమట్టం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. భూకబ్జాదారులను గ్రామస్తులు చితకబాదారు.