• Home » TGSRTC

TGSRTC

City buses: గ్రేటర్‌లో.. తగ్గిన సిటీబస్సులు

City buses: గ్రేటర్‌లో.. తగ్గిన సిటీబస్సులు

గ్రేటర్‌ హైదరాబాద్‏లో సిటీ బస్సులు తగ్గాయి. దాదాపు 500 బస్సులను జిల్లాలకు తరలించారు. దీంతో నగరంలో సిటీబస్సులు తగ్గిపోయాయి. సంక్రాంతి పండుగ సెలవులు రావడం, శని, ఆదివారాలు కూడా పాఠశాలలకు సెలవులే కావడంతో చాలామంది ఇంకా ఊర్లల్లోనే ఉండిపోయారు. దీంతో నగరంలో బస్సులను తగ్గించారు.

Medaram: భక్తులతో ఆర్టీసీ బస్టాండ్‌ కిటకిట..

Medaram: భక్తులతో ఆర్టీసీ బస్టాండ్‌ కిటకిట..

మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు ముందుగానే వెళుతుండడంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. జాతర కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. జాతర సమయంలో భక్తలు పెద్దసంఖ్యలో విచ్చేయనుండడంతో.. ముందుగానే వెళుతున్న భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళుతున్నారు.

Sankranti Rush: సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..

Sankranti Rush: సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దిల్‌సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది..

Sankranthi special buses: సంక్రాంతికి 9 నుంచి ప్రత్యేక బస్సులు

Sankranthi special buses: సంక్రాంతికి 9 నుంచి ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 9వతేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

TGSRTC Special Buses: సంక్రాంతికి ఊరెళుతున్నారా? నో టెన్షన్.. 6,431 ప్రత్యేక బస్సులు!

TGSRTC Special Buses: సంక్రాంతికి ఊరెళుతున్నారా? నో టెన్షన్.. 6,431 ప్రత్యేక బస్సులు!

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్. పండుగ రద్దీ దృష్ట్యా టీజీఎస్‌‌‌ఆర్‌టీసీ ఆరు వేల పైచిలుకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తేనుంది. జనవరి 9 నుంచి 13వ తేదీల మధ్య, ఆపై జనవరి 18, 19 తేదీల్లో ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Hyderabad: గ్రేటర్‌లో... మరిన్ని ఈవీ డిపోలు..

Hyderabad: గ్రేటర్‌లో... మరిన్ని ఈవీ డిపోలు..

హైదరాబాద్ మహానగరంలో మరిన్ని ఈవీ డిపోలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలో ఆయా ఏరియాల్లో ఈవీ బస్సులు నడుస్తున్నాయి. అయితే.. ఈ బస్సులకు చార్జింగ్ పెట్టుకునేందుకుగానూ ఈవీ డిపోలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

Sankranthi Festival: సంక్రాంతికి శివార్ల నుంచి ఆర్టీసీ సర్వీసులు

Sankranthi Festival: సంక్రాంతికి శివార్ల నుంచి ఆర్టీసీ సర్వీసులు

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులతను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ శ్రీలత తెలిపారు. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్‌బీనగర్‌ నగర్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.

Electric buses: గ్రేటర్‌లో.. మరో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు..

Electric buses: గ్రేటర్‌లో.. మరో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు..

గ్రేటర్ హైదరాబాద్‏లో నూతనంగా మరో వెయ్యి ఈవీ బస్సులను నడిపేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఒక్క ఫిబ్రవరిలో 170 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి.. 2026 చివరి నాటికి మొత్తం వెయ్యి బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Medaram Jathara: మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Medaram Jathara: మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

జనవరి 28వతేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు బీహెచ్‌ఈఎల్‌ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ సుధా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీల నుంచి స్థానికులు కలిసికట్టుగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు ప్రత్యేక బస్సులు ఆయా కాలనీలకు పంపిస్తామని తెలిపారు.

Sankranthi special buses: బీహెచ్‌ఈఎల్‌ నుంచి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

Sankranthi special buses: బీహెచ్‌ఈఎల్‌ నుంచి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు బీహెచ్‌ఈఎల్‌ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రితోపాటు ఇంకా ఈయా ఏరియాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి