Medaram Jathara: మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Dec 31 , 2025 | 07:11 AM
జనవరి 28వతేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు బీహెచ్‌ఈఎల్ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుధా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీల నుంచి స్థానికులు కలిసికట్టుగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు ప్రత్యేక బస్సులు ఆయా కాలనీలకు పంపిస్తామని తెలిపారు.
- బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి మేడారం యాత్ర పేరుతో స్పెషల్ ఆపరేషన్స్
హైదరాబాద్ సిటీ: బీహెచ్‌ఈఎల్ నుంచి ములుగు జిల్లాలోని మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు బీహెచ్‌ఈఎల్ బస్ డిపో మేనేజర్ సుధా(BHEL Bus Depot Manager Sudha) తెలిపారు. మేడారం జాతర పూర్తయ్యే వరకు భక్తుల రద్దీ మేరకు బస్సులు నడిపేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మేడారం యాత్ర పేరుతో మల్లూరు లక్ష్మీ నర్సింహాస్వామి, లక్నవరం చెరువు, భద్రకాళి, ఐనవోలు మల్లన్న, మేడారం సమ్మక్క సారక్క వరకు ప్రత్యేక బస్సుల అపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

http://www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ చేసుకోవచ్చనిన్నారు. ఇతర వివరాలకు 9391072283, 9063401072 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. టూర్ ప్యాకేజీలో భాగంగా ఒక్కో వ్యక్తికి రూ.1500 చార్జీ వసూలు చేస్తునట్లు తెలిపారు. కాలనీలు, బస్తీల నుంచి స్థానికులు కలిసికట్టుగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు ప్రత్యేక బస్సులు ఆయా కాలనీలకు పంపిస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు
Read Latest Telangana News and National News