Share News

Hyderabad: గ్రేటర్‌లో... మరిన్ని ఈవీ డిపోలు..

ABN , Publish Date - Jan 07 , 2026 | 08:17 AM

హైదరాబాద్ మహానగరంలో మరిన్ని ఈవీ డిపోలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలో ఆయా ఏరియాల్లో ఈవీ బస్సులు నడుస్తున్నాయి. అయితే.. ఈ బస్సులకు చార్జింగ్ పెట్టుకునేందుకుగానూ ఈవీ డిపోలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

Hyderabad: గ్రేటర్‌లో... మరిన్ని ఈవీ డిపోలు..

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ ఆర్టీసీని ఈవీ జోన్‌గా మార్చే దిశగా ఆ శాఖ చర్యలు చేపడుతోంది. ఎలక్ర్టిక్‌ బస్సులు(Electric buses) పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు పెంచుకోవడంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే కంటోన్మెంట్‌, మియాపూర్‌, రాణిగంజ్‌, హయత్‌నగర్‌, హెచ్‌సీయూ(Cantonment, Miyapur, Raniganj, Hayathnagar, HCU) డిపోలలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి రాగా ఈ ఏడాది డిసెంబరు నాటికి దశలవారీగా మరో 20 బస్‌ డిపోలలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


city4.jpg

త్వరలో కూకట్‌పల్లి డిపో(Kukatpally Depot)లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌ పనులు ప్రారంభించనున్నారు. గ్రేటర్‌లో ప్రస్తుతం 370 ఈవీ బస్సులు నడుస్తుండగా మరో 170 ఈవీ బస్సులు ఫిబ్రవరి నాటికి రోడ్లపైకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ ఉత్సవ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 07 , 2026 | 08:17 AM