Sankranthi special buses: సంక్రాంతికి 9 నుంచి ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Jan 08 , 2026 | 08:38 AM
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 9వతేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సిటీ: సంక్రాంతి(Sankranthi)కి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం జనవరి 9 నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్(MGBS, JBS)తోపాటు ఉప్పల్ క్రాస్‌రోడ్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్‌రోడ్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి(KPHB, Boyinpally, Gachibowli) ప్రాంతాల నుంచి ఏపీ, తెలంగాణ(AP, Telangana) జిల్లాలకు బస్సులు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ సర్వీసులు నడుపుతామని, ప్రత్యేక బస్సుల్లో 1.5 శాతం అధిక చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లకు టీజీఎస్ ఆర్టీసీబస్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం
ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ
Read Latest Telangana News and National News