Medaram: భక్తులతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిట..
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:00 PM
మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు ముందుగానే వెళుతుండడంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. జాతర కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. జాతర సమయంలో భక్తలు పెద్దసంఖ్యలో విచ్చేయనుండడంతో.. ముందుగానే వెళుతున్న భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళుతున్నారు.
- 8 నుంచి 40కి పెంచిన సర్వీస్‌లు
హనుమకొండ(వరంగల్): మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు భక్తులు ముందస్తు రాకపోకలతో హనుమకొండ బస్టాండ్(Hanumakonda Bustand) ప్రాంగణం కిటకిటలాడుతోంది. మేడారం జాతరకు వెళ్లడాని కి ప్రయాణికులు రోజు రోజుకు పెరుగుతుండడంతో సాధారణ రోజుల్లో 8 బస్సు సర్వీస్‌లు నడవగా నాలుగు రోజుల నుంచి 35 నుంచి 40 బస్సు సర్వీస్‌లు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు సోమవారం తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మేడారానికి భక్తులు తరలి వెళ్తుండడంతో బస్టాండ్‌లో రద్దీ ఏర్పడుతోంది.

ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే అవసరా న్ని బట్టి మరిన్ని సర్వీస్‌లు పెంచుతామని అధికారులు తెలిపారు. భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ ఆర్‌ఎం డి.విజయభాను వెల్లడించారు. కాగా, ప్రస్తుతం మేడారం వెళ్లే భక్తులకు పెద్దలకు రూ. 190, పిల్లలకు రూ. 80 టికెట్ ధర ఉన్నట్లు మేడారం వెళ్లే బస్సులకు ఎక్స్‌ప్రెస్ చార్జీలే వసూలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి.
వందేభారత్ స్లీపర్‌లో నో ఆర్‌ఏసీ
‘తుంగభద్ర’ గేటు ట్రయల్‌రన్ సక్సెస్
Read Latest Telangana News and National News