Home » TG News
మున్సిపల్ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటరన్న ఎవరిని కరుణిస్తాడోనని ఆయా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
నగరంలో కేరళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఓ హోటల్‌లో రోడ్ షో నిర్వహించారు. ట్రావెల్ నౌ, పోస్ట్ లేటర్ పేరిట వినూత్న ప్రచారం నిర్వహించారు.
ప్రైవేటు అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలకు జేఎన్‌టీయూ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్ నెలలో ఎఫ్‌ఎ్‌ఫసీ తనిఖీలు షెడ్యూల్ చేయనుండగా, అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయా కళాశాలల యాజమాన్యాలకు వర్సిటీ ఉన్నతాధికారులు లేఖలు రాశారు.
గ్రేటర్ జోన్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కంటోన్మెంట్, మియాపూర్, రాణిగంజ్, హయత్‌నగర్, హెచ్‌సీయూ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు నడుస్తున్నాయి.
నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, సమ్మర్ డిమాండ్ మొదలైందని, వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు.
ఓటర్లను సంతృప్తిపరచాలి.. ఎంత ఖర్చయినా పెట్టాలి.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి.. ఏ పార్టీ అభ్యర్థి అయినా చేసేదిదే..!! రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా ఇదే లక్ష్యంతో విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు.
టీజీఎస్పీడీసీఎల్ వసంతనగర్ సెక్షన్ పరిధి జేఎన్‌టీయూ 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల కోసం బుధవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పోరేషన్ల పరిధిలోని వార్డు, డివిజన్లకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 ....
హనుమకొండ కేయూ పోలీసుస్టేషన్ పరిధి గుండ్లసింగారం సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌లో న్యాయవాది రాజిడి వెంకటరాజా నర్సింహారెడ్డి (48) సోమవారం గల్లంతయ్యారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 13, బీన్స్ 28, క్యారెట్ 18లకు విక్రయిస్తున్నారు.