Share News

సమ్మర్‌ డిమాండ్‌ షురూ..

ABN , Publish Date - Feb 11 , 2026 | 07:37 AM

నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, సమ్మర్‌ డిమాండ్‌ మొదలైందని, వేసవిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ తెలిపారు.

సమ్మర్‌ డిమాండ్‌ షురూ..

  • విద్యుత్‌ ఫీడర్లపై అదనపు లోడ్‌ పడకుండా చర్యలు

  • మొదటిసారిగా 20కి పైగా సబ్‌స్టేషన్లలో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

  • గ్రేటర్‌లో అదనంగా 1,888 డీటీఆర్‌లు

  • టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ వెల్లడి

హైదరాబాద్‌ సిటీ: నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, సమ్మర్‌ డిమాండ్‌ మొదలైందని, వేసవిలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ తెలిపారు. ఖైరతాబాద్‌లోని టీజీఎస్పీడీసీఎల్‌ ప్రధానకార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. 33 కేవీ, 11 కేవీ ఫీడర్లపై లోడ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు.


33కేవీ ఫీడర్లపై 300 యాంప్స్‌, 11 కేవీ ఫీడర్లపై 150యాంప్స్‌ లోడ్‌ మించకుండా చూడాలన్నారు. డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను టంగ్‌ టెస్టర్‌తో రీడింగ్‌ తీయడం మొదలు పెట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించామన్నారు. సమ్మర్‌యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పనులు 95 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు ఈనెల 15 నాటికి పూర్తిచేస్తామన్నారు. బస్తీబాట కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


city2.jpgఏప్రిల్‌, మే నెలల్లో గ్రేటర్‌లో విద్యుత్‌ డిమాండ్‌ 5 వేల మెగావాట్లు దాటుతుందని అంచనా వేస్తున్నామన్నారు. అదనపు లోడ్‌ పడుతున్న సబ్‌ స్టేషన్లను గుర్తించామని, 20కి పైగా సబ్‌స్టేషన్లలో మొదటిసారిగా 16 మెగావోల్ట్స్‌ సామర్థ్యంగల పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (పీటీఆర్‌) ఏర్పాటు చేశామని తెలిపారు. సమ్మర్‌ డిమాండ్‌కు అనుగుణంగా గ్రేటర్‌లో అదనంగా 1,888 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌) ఏర్పాటు చేశామన్నారు. వీటిలో రంగారెడ్డి జోన్‌లో 965, మేడ్చల్‌ జోన్‌లో 626, మెట్రోజోన్‌లో 297 డీటీఆర్‌లు ఉన్నాయన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎవరికీ పట్టనివారు ఆమెకు కావల్సినవారు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 11 , 2026 | 07:37 AM