హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
ABN , Publish Date - Feb 11 , 2026 | 07:02 AM
టీజీఎస్పీడీసీఎల్ వసంతనగర్ సెక్షన్ పరిధి జేఎన్‌టీయూ 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల కోసం బుధవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ వసంత నగర్ సెక్షన్ పరిధి జేఎన్‌టీయూ 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల కోసం బుధవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి(AE Vani) ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు వసంతనగర్, భగత్‌సింగ్‌నగర్ ఫేజ్-1, ఫేజ్-2, సాయినగర్, సర్దార్‌పటేల్‌నగర్, హైదర్‌నగర్ మెయిన్‌రోడ్డు, గోకుల్‌ఫ్లాట్స్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆమె కోరారు.
హైదర్‌నగర్‌లో..
హైదర్‌నగర్ డివిజన్‌లో విద్యుత్ మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జయనగర్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా జయనగర్, మాధవినగర్, అరుణ సొసైటీలో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ ఉండదన్నారు. ఎల్లమ్మబండ ఫీడర్ పరిధిలోని మహాకాళినగర్, మహవీర్‌నగర్, ఎల్లమ్మబండ, ఇంద్రహిల్స్, చంద్రమ్మనగర్ ప్రాంతాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఎన్టీఆర్‌నగర్, జేయూఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నగర్‌లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు. అదే విధంగా శ్రీరామ్‌నగర్ ఫీడర్ పరిధిలోని శ్రీరామ్‌నగర్, సాయిచరణ్‌కాలనీ, ఇంద్రహిల్స్, వీకర్‌సెక్షన్ కాలనీ, హెచ్‌ఎంటీహిల్స్ ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ అధికారులు తెలిపారు.
చిక్కడపల్లి: మరమ్మతుల కారణంగా ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటీ-2 పరిధిలో బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చెన్నారెడ్డినగర్, పటేల్‌నగర్, బాపూనగర్, ఏవీ కాలేజ్ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పటేల్‌నగర్, అలీకేఫ్, ప్రేమ్‌నగర్, గగన్‌మహల్ పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
హైదర్‌నగర్: జయనగర్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జయనగర్, మాధవి నగర్, అరుణ సొసైటీలో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ ఉండదన్నారు.
ఎల్లమ్మబండ ఫీడర్ పరిధిలో..
ఎల్లమ్మబండ ఫీడర్ పరిధిలో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహాకాళినగర్, మహవీర్‌నగర్, ఎల్లమ్మబండ, ఇంద్రహిల్స్, చంద్రమ్మనగర్ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎన్టీఆర్‌నగర్, జేయూఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నగర్‌లో విద్యుత్ ఉండదన్నారు.
శ్రీరామ్‌నగర్ ఫీడర్ పరిధిలో..
శ్రీరామ్‌నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు శ్రీరామ్‌నగర్, సాయిచరణ్‌కాలనీ, ఇంద్రహిల్స్, వీకర్‌సెక్షన్ కాలనీ, హెచ్‌ఎంటీహిల్స్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎవరికీ పట్టనివారు ఆమెకు కావల్సినవారు
Read Latest Telangana News and National News