Home » TG News
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బుధవారం నుంచి 20 బోగీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి.
గ్రామాల్లో ఎన్నికల హడావుడికి వేళయింది! అధికారికంగా పార్టీలు లేకపోయినా.. పల్లెల్లో రంగురంగుల జెండాలు.. ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది....
ఐబొమ్మ రవిని గత నాలుగు రోజులుగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో పోలీసులకు రవి సరిగా సహకరించడం లేదనే వార్తలు వస్తున్నాయి.
అభివృద్ధికి కేరాఫ్‌గా సనత్‌నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో 2014 తర్వాతనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెట్టామని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి త్వరితగతిన స్పందించే విధంగా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శామీర్‌పేట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారులో మంటలు వ్యాపించి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
భాగ్యనగరంలో మరోసారి భూముల వేలానికి హెచ్ఎండీఏ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కోకాపేట, మూసాపేట భూములకు సోమవారం నుంచి ఈ వేలం వేయనున్నారు
వీసా రాకపోవడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ పద్మారావు నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వైద్యురాలు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
రోజు రోజుకూ విస్తరిస్తున్న రాజధాని నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 50, 60 ఏళ్ల క్రితం నెలకొల్పిన పారిశ్రామిక ఎస్టేట్లు...
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..