ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 9:30 గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Feb 12 , 2026 | 07:00 AM
బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి 10:15 గంటల వరకు 11కేవీ జవహర్ నగర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ ఉండదని తెలిపారు.
హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్: బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి 10:15 గంటల వరకు 11కేవీ జవహర్ నగర్ ఫీడర్ పరిధి, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ లుంబిని మాల్, శాంగ్రిళ్ల ప్లాజా, సత్యసాయి ఫీడర్ల పరిధి, ఉ దయం 10:30 గంటల నుంచి 11 గంటల వరకు 11కేవీ స్టేట్ హోం ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాలు, ఉదయం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు 11కేవీ సవేరా ఫీడర్ పరిధి,
ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు 11కేవీ మారుతి నగర్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని ఆయన తెలిపారు. అలాగే, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఒంటిగంట వరకు 11కేవీ అక్బర్ ఫామ్ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఇంజనీర్స్ కాలనీ ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 గంటల వరకు రామానాయుడు స్టూడియో ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు సీఓడీ ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ తాతారావు, కమలాపురి కాలనీ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
చిక్కడపల్లి: మరమ్మతుల కారణంగా ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటీ-2 పరిధిలో గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చెన్నారెడ్డినగర్, పటేల్‌నగర్, బాపునగర్, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, ఏవీ కాలేజ్ ఫీడర్ల పరిధిలో, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జగదీశ్‌మార్కెట్, జేఎన్ ఫీడర్ పరిధిలో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పటేల్ నగర్, ఆలీకేఫ్, ప్రేమ్‌నగర్, గగన్‌మహల్ పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని వారు పేర్కొన్నారు.
ఉప్పల్: విద్యుత్ మరమ్మతుల కారణంగా చిల్కానగర్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వినయ్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాలాజీ హిల్స్ ఫీడర్... నార్త్ బాలాజీ హిల్స్, రాజశేఖర్ కాలనీ, బాలాజీ హిల్స్, వెస్ట్, ఈస్ట్ బాలాజీ హిల్స్, మెక్‌డోవెల్ కాలనీ, న్యూ రామ్‌నగర్, న్యూ హేమానగర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు అయ్యప్ప టెంపుల్ ఫీడర్ ... ఈస్ట్ బాలాజీ హిల్స్, శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీ, స్వరూ్‌పనగర్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.
రామంతాపూర్: రామంతాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో ఈనెల 12న గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొంటుందని సంబంధిత ట్రాన్స్‌కో ఏఈ కూతాడి లావణ్య తెలిపారు. శ్రీనగర్ ఫీడర్.. శ్రీనగర్ కాలనీ, భరత్‌నగర్, శ్రీరమణ పురం, సత్యనగర్, కుర్మనగర్, కేసీఆర్‌నగర్, కమాన్, సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు. కామాక్షిపురం ఫీడర్.. వివేక్‌నగర్, కామాక్షిపురం, వాసవినగర్, రాంరెడ్డినగర్ తదితర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండదని విజ్ఞప్తి చేశారు.
కేపీహెచ్‌బీకాలనీ: టీజీఎస్పీడీసీఎల్ వసంతనగర్ సెక్షన్ పరిధి జేఎన్‌టీయూ 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్వాహణ కోసం బుధవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వసంతనగర్, భగత్‌సింగ్‌నగర్ ఫేజ్-1, ఫేజ్-2, సాయినగర్, సర్దార్‌పటేల్‌నగర్, హైదర్‌నగర్ మెయిన్‌రోడ్డు, గోకుల్ ప్లాట్స్ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఉండదని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పాడాల్సిందే!
Read Latest Telangana News and National News