డాడీ.. నేనిక డ్యాన్స్ చేయలేనా ?
ABN , Publish Date - Feb 11 , 2026 | 01:49 PM
డాడీ నేను ఇక డాన్స్ లేయలేనా ? అన్న కుమారుడి మాటలకు ఓ తండ్రి చలించిపోయి బోరున విలపించాడు. సోమవారం పర్వతగిరి మండలం శ్రీనగర్ గ్రామ శివారులో పాఠశాల బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కొంకపాక గ్రామానికి చెందిన రాజు కుమారుడు హర్షిత్ (10) తీవ్రంగా గాయపడ్డాడు.
రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన బాలుడి ఆవేదన
కొడుకు మాటలకు విలపించిన తండ్రి
పర్వతగిరి(వరంగల్): డాడీ నేను ఇక డాన్స్ లేయలేనా ? అన్న కుమారుడి మాటలకు ఓ తండ్రి చలించిపోయి బోరున విలపించాడు. సోమవారం పర్వతగిరి మండలం శ్రీనగర్ గ్రామ శివారులో పాఠశాల బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కొంకపాక గ్రామానికి చెందిన రాజు కుమారుడు హర్షిత్ (10) తీవ్రంగా గాయపడ్డాడు. సంగెంలోని రోటరీ డామ్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న హర్షిత్ బస్సు ముందుభాగంలో కూర్చున్నాడు. ప్రమాదంలో బస్సు గ్లాస్ పగిలి బస్సులో నుంచి బయటపడ్డాడు. కాలు రెండు చోట్ల విరిగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ముందుగా ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు బాలుడి తండ్రి రాజు తెలిపారు. హర్షిత్‌కు చిన్నతనం నుంచే డాన్స్ అంటే ఇష్టమని, పాఠశాలలో జరిగే ఏ కార్యక్రమైనా బహుమతి సంపాదించేవాడని రాజు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. తానింకా డాన్స్ చేయలేనా డాడీ ? అనే మాటలు తలచుకొని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం బాలుడిని పరామర్శించడానికి రాలేదని పేర్కొన్నారు. వ్యవసాయం చేస్తూ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నట్లు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వారానికి నాలుగు రోజులు రామేశ్వరం-తిరుపతి రైలు
ఎవరికీ పట్టనివారు ఆమెకు కావల్సినవారు
Read Latest Telangana News and National News