Home » TG Govt
సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్, దూల్మిట్ట మండలల్లో వరి పంటకు అపార నష్టం వట్టిల్లింది. చేర్యాల మండలంలో.. భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారీ పని చేస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటిని బీ టీమ్ అంటుందని పేర్కొన్నారు.
మొంథా తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు. రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.
నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ మ్యాన్హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి అధికారులు సూచించారు. ఎమర్జెన్సీ కోసం జలమండలి హెల్ప్ లైన్ 155313కి కాల్ చేయాలని ఆయన కోరారు. జంట జలాశయాల గేట్లు ఎత్తిన నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినా.. ఇంకా తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని చిరంజీవి మండిపడ్డారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
1200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టు శుభవార్త తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియమించిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లని విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సినీ కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాలలు నిర్మిస్తానని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు.
తెలంగాణలో రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపోయే యూరియాను కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఎరువుల తయారీ కంపెనీల నుంచి ఎరువులను సేకరించడంతోపాటుగా.. విదేశాల నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకోవడం ద్వారా.. దేశంలో యూరియా కొరత తగ్గించేందుకు కేంద్రం చొరవ తీసుకుందని పేర్కొన్నారు కిషన్రెడ్డి.
తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న, చంద్రన్న, మావోయిస్టు రాష్ట్ర కమిటీ మెంబర్ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు. అయితే, పుల్లూరి ప్రసాద్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టాల్సిన ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకి సీఎం పలు కీలక సూచనలు చేశారు.