Home » TG Govt
జూబ్లీహిల్స్లో మజ్లిస్, బీజేపీకి మధ్యే పోటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి వేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్సైట్లు, సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్గా మారాయి.
కొన్ని నెలలుగా తల్లి, కుమారుడికి గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆ గొడవల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రయత్నిస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన జీవో-32పై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.
హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సబర్మతి నిరాశ్రయులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.
చాదర్ఘాట్ సమీపంలో శనివారం సాయంత్రం ఇద్దరు స్నాచర్లు సెల్ఫోన్లు కొట్టేసేందుకు యత్నించిగా అడ్డుకున్న పోలీసులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మొబైల్ స్నాచింగ్ చేసి పారిపోతున్న మహమ్మద్ అమీర్ అన్సారీ.. ఎదురుతిరిగి గన్మెన్ సత్యనారాయణ మూర్తిపై కత్తితో దాడి చేశాడు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అక్టోబరు జీతాల చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు జీతం చెల్లించొద్దని నిర్ణయం తీసుకుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వస్తే బాకీ కార్డు చూపెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అవ్వా , తాతలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని అన్నారని.. ఇచ్చారా? అంటూ నిలదీశారు. మహిళలకు రూ.2500 ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో 14వేల అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల నియామకాన్ని చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
మద్యం టెండర్ల పొడిగింపుపై లిఖితపూర్వక వాదనలు ఏఏజీ ఇస్తామని కోర్టుకు తెలిపారు. మద్యం టెండర్లకు సోమవారం యథావిధిగా డ్రా తీయవచ్చని కోర్టు పేర్కొంది.