Home » Telugu News
మండల పరిధిలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం కాస్త తెరిపి ఇచ్చి సాయంత్రం మళ్లీ భారీ వర్షం పడింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్ష్మీపురం, రంగబయలు, బూసిపుట్టు, దొడిపుట్టు, బంగారుమెట్ట, జోలాపుట్టు, సుజనకోట, తదితర పంచాయతీల పరిధిలో పలు చోట్ల గెడ్డలు వరద నీటితో ప్రమాదభరితంగా ప్రవహిస్తున్నాయి.
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ ఆదేశించారు. మంగళవారం మండలంలోని గన్నెల స్వర్ణ గ్రామ సచివాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ సమస్యలు, తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, పింఛన్లు, ప్రభుత్వ పథకాలు, తదితర సమస్యలకు అధికారులకు 64 అర్జీలను ప్రజలు సమర్పించారు.
గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న కాకరపాడు పోస్టుమెట్రిక్ వసతి గృహ భవనం ఎట్టకేలకు వినియోగంలోకి వచ్చింది.
జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో ప్రాథమిక రంగాల అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మండలంలోని తూటిపాల రెవెన్యూ పరిధిలో రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. తూటిపాల రెవెన్యూలో అడిగర్లపాలెం, పాపయ్యపాలెంలో ల్యాండ్ బ్యాంకు కింద గుర్తించిన భూముల్లో 433.3 ఎకరాలను వెయ్యి మెగావాట్ల హైపర్‌స్కేల్/ కోలోకేషన్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించింది. రూ.85.200 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ నిర్మాణానికి అక్టోబరులో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది.
ప్రజల భద్రత విషయంలో రాజీ పడొద్దని, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.
ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున రైతులు వరి బదులు తక్కువ నీరు అవసరం అయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె మండలంలోని పులపర్తి గ్రామంలో పంటలను పరిశీలించారు.
జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఏటా రూ.5 కోట్ల నిధులు మంజూరుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది. పనులు పూర్తిచేస్తే నిధులు విడతలుగా మంజూర వుతాయి. ఈ పనులు సకాలంలో పూర్తి కాకపోవ డం విమర్శలకు తావిస్తోంది.
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ... ఈ సందర్భంగా విధించిన అపరాధ రుసుము వసూళ్ల విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అక్రమ మైనింగ్, అనుమతులకు మించి తవ్వకాలు, అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నామని గనుల శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెబుతున్నప్పటికీ కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేయడంతో తమ పనైపోయిందని అధికారులు మిన్నకుండిపోతున్నారు. గతంలో విధించిన అపరాధ రుసుములను పూర్తిస్థాయిలో వసూలు చేయకుండా, అక్రమ మైనింగ్‌దారులకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.