దక్షిణ మధ్య రైల్వేలో ఓటీపీ లింక్‌తో తత్కాల్ టికెట్లు
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:42 AM
దక్షిణ మధ్య రైల్వేలో ఇకపై ఓటీపీ లింక్‌తో తత్కాల్ టికెట్లు ఇవ్వనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం తిరుపతి నుంచి వివిధ మార్గాల్లో వెళ్లే వందేభారత్ రైళ్లలో ఈ పద్ధతి అమలు చేస్తున్నారు.
తిరుపతి(సెంట్రల్),డిసెంబరు4(ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వేలో ఇకపై ఓటీపీ లింక్‌తో తత్కాల్ టికెట్లు ఇవ్వనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం తిరుపతి నుంచి వివిధ మార్గాల్లో వెళ్లే వందేభారత్ రైళ్లలో ఈ పద్ధతి అమలు చేస్తున్నారు. ‘ఆధార్‌తో లింక్‌అయిన ఫోన్ నెంబరు ఇవ్వాలి. టికెట్ బుక్ చేసే సమయంలో ఓటీపీ వచ్చాకే టికెట్ వస్తుంది’ అని తెలిపారు.