కార్తీక పౌర్ణమి దీపోత్సవం
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:44 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం కన్నులపండువగా జరిగింది. మొదట యోగనరసింహస్వామి ఆలయం పక్కనే ఉన్న పరిమళం అర వద్ద కొత్త మూకుళ్లలో దీపాలను వెలగించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం కన్నులపండువగా జరిగింది. మొదట యోగనరసింహస్వామి ఆలయం పక్కనే ఉన్న పరిమళం అర వద్ద కొత్త మూకుళ్లలో దీపాలను వెలగించారు. ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారిమేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కళ్యాణమండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయమండపం, పూలబావి, రంగనాయకమండపం, మహద్వారం, బేడిఆంజనేయస్వామి, వరాహస్వామిఆలయం, పుష్కరిణి వద్ద సుమారు వెయ్యి నేతి జ్యోతులను వెలిగించారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి