నిషేధిత జాబితా నుంచి గుండ్రాజుకుప్పం భూములు
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:46 AM
నగరి మండలం గుండ్రాజుకుప్పం భూములను నిషేధిత జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): నగరి మండలం గుండ్రాజుకుప్పం భూములను నిషేధిత జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ గ్రామంలోలోని సర్వేనెంబరు 55/1లోని మూడెకరాలు, సర్వే నెం. 55/3లో 1.86 ఎకరాలను రిజిస్ట్రేషన్ చట్టం ద్వారా నోటిఫై చేసిన నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.